వైసిపి ఎన్నికల ప్రచారం

Apr 29,2024 22:02

ప్రచారం నిర్వహిస్తున్న దుద్దుకుంట అపర్ఱరెడ్డి

                  కదిరి టౌన్‌ : వచ్చే ఎన్నిలలో వైసిపిని ఆదరించాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్‌ ఓటర్లను కోరారు. సోమవారం కదిరి మున్సిపల్‌ పరిధిలోని 35 వార్డు, కదిరి రూరల్‌ మండల పరిధిలోని మొటుకు పల్లి, కౌలేపల్లి గ్రామాలలోని స్థానిక నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైసిపితోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. అమలుకు సాధ్యమయ్యే హామీలను జగనన్న ఇస్తుంటే ఓర్వలేని టిడిపి నాయకులకు భయం పట్టుకుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, పరికి షాదిక్‌బాషా, వైస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌ రెడ్డి, లీగల్‌ సెల్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, మాజీ టెంపుల్‌ చైర్మన్‌ గోపాలకృష్ణ, పార్టీ యువ నాయకులు ప్రణీత్‌ రెడ్డి, జడ్పిటిసి భూక్యా రాధాకృష్ణ నాయక్‌, కౌన్సిలర్‌ మురళి, జంపాల నాగేంద్ర, శీన, అశోక్‌ గిరిధర్‌, సర్పంచి రాము, ఎంపీటీసీ లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తచెరువు రూరల్‌ : వైసీపీ ప్రభుత్వముతోనే అభివద్ధి సాధ్యమని ఆపార్టీ మండల కన్వీనర్‌ జగన్మోహన్‌ రెడ్డి, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రాధా నాగరాజు, కాపునాడు జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్‌ సూరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పాదయాత్ర వాల్మీకి శంకర్‌ అన్నారు. ఈసందర్భంగా వారు కొత్త చెరువులోనే బసవన్న కట్ట వీధి, ముస్లిం కాలనీ, మేదర వీధిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండ్‌ ప్రెసిడెంట్‌ నాగభూషణ్‌, వైస్‌ సర్పంచి యుగేందర్‌, ఎంపీటీసీ రఫీ, ఆవుల లక్ష్మీదేవి ,సోమశేఖర్‌ రెడ్డి షాజహాన్‌, వడ్డే నారాయణ, అంగడి సత్తి, ఎల్లప్ప, పెయింటర్‌ కేశవ తదితరులు పాల్గొన్నారు. పరిగి : మండలంలోని బాలిరెడ్డిపల్లి, శాసనకోట, బోరెడ్డిపల్లి, కోడిగనహళ్లి గ్రామాలలో వైసిపి పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి భర్త చరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా శీరేకోళం, బోరెడ్డిపల్లి, మోద, శ్రీరంగరాజుపల్లిలోని కాంగ్రెస్‌, టిడిపి చెందిన పలువురు వైసిపిలో చేరారు. వీరికి చరణ్‌ రెడ్డి వైసిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ధనాపురం రామకృష్ణ, నయాజ్‌, నంజుండప్ప, ఆంజనేయులు, క్రిష్టప్ప, రామచంద్ర, శ్రీరాములు తదితరులు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి పార్టీలోకి చేరామన్నారు. బత్తలపల్లి :బత్తలపల్లిలో 50 రజక కుటుంబాలు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వగృహంలో వైసిపి మండల ఉపాధ్యక్షులు కోటి సురేష్‌కుమార్‌, మాజీ మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో రజకులు వైసిపిలో చేరారు. వీరికి కేతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. శ్రీరాములు, నారాయణస్వామి, నాగేష్‌, తిరుపాలు, రామాంజనేయులు, సత్యప్ప, గంగాఢ, శ్రీనివాసులు. నాగేంద్ర, ఎస్‌. నాగేంద్ర, మంజు, రామకృష్ణ, వెంకటరాముడు, రమణ, రాము, కాప్పు, ఆనందు, నాగభూషణ, మల్లిఖార్జున, రవి, కంబగిరి, పోతులయ్య, వెంకటనారాయణ, శేఖర్‌, ఓబుళపతి, హర్షవర్ధన్‌, రాహుల్‌, బ్రహ్మయ్య, లక్ష్మణ్‌, రాము, సురేష్‌ అడెప్ప, ఫోటో ఆనందు, రమేష్‌, నరసింహులు, నాగభూషణ, ప్రసాద్‌, గోవర్ధన్‌, డ్రైవర్‌ రమేష్‌, మంజునాధ్‌. ఆంజనేయులుతో పాటు పలు కుటుంబాలకు చెందిన వారు వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమతం ఈశ్వరయ్య, సహకార సంఘం డైరెక్టర్‌ ఈడిగ కాళప్ప నాయకులు విల్లే సూరి, యోగానందాచారి. ఆక్రియా, హాసన్‌, చర్మాల సురేష్‌, లోకేష్‌ మొసంపు, మందం నారాయణ. కమతం లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు గోకులం నుంచి దుద్దుకుంట అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డులోని ప్రధాన రహదారిలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మీ నారాయణ రెడ్డి, పుడా ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ నరసమ్మ, కన్వీనర్‌ రంగారెడ్డి, మెప్మా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల రెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ కవితా రెడ్డి, రామకష్ణ, కౌన్సిలర్‌ సాయినాథ్‌ యాదవ్‌, శంకర తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం పులగంపల్లి పంచాయతీకి చెందిన పలువురు టిడిపి కార్యకర్తలు వైసిపిలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వారు వైసిపిలో చేరారు. సోమవారం పుట్టపర్తి వైసీపీ కార్యాలయంలో శ్రీధర్‌ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొండే గంగి రెడ్డి, ఎం.నారాయణ రెడ్డి, చిన్న రెడ్డి, రాజా రెడ్డి, జగదీష్‌ చంద్ర బోష్‌, కోటయ్య, జె.కళ్యాణ్‌, కొండే మనికంటరెడ్డి ఏ.ఆదినారాయణ తదితరులు వైసిపిలో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్లుగా టిడిపిలో ఉన్నామని అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రవర్తన నచ్చకే వైసీపీలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని వైసిపి అసెంబ్లి అభ్యర్థి దీపిక అన్నారు. పట్టణంలోని వైసిపి కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తమతో పాటు రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వైసిపి అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సమన్వయ కర్త కొండూరు వేణుగోపాల్‌ రెడ్డి, కౌన్సిలర్‌ షాజియా, ప్రశాంత్‌ గౌడ్‌, నాగభూషణరెడ్డి, నారాయణ స్వామి, గంగిరెడ్డి, రాము, సుభాష్‌ గాంధి తదితరులు పాల్గొన్నారు.

➡️