యువతకు చైతన్య స్ఫూర్తి శ్రీశ్రీ రచనలు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తన రచనలతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టి శ్రామిక వర్గం పై ఆయన రచనలు, యువతను కదిలించే శక్తి ఆయన కవిత్వం, నిత్యం రగిలే నిప్పు కణికలు ఆయన రచనలు అని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ తెలిపారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా స్థానిక నిహార్‌ స్కిల్‌ డెవల ప్‌మెంట్‌లో చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లా డుతూ శ్రీశ్రీ రచనలు ఉత్తేజభరితంగా, సమాజానికి అఅను నిత్యంగా ఉంటాయని చెప్పారు. శ్రామిక వర్గానికి దగ్గరగా ఆయన రచనలు ఉంటాయన్నారు. ముఖ్య ంగా యువతను కదిలించే విధంగా కవిత్వాల ుంటాయని తెలిపారు. అందుకే ఆయనను విప్లవ కవి అని కూడా అంటుంటారని చెప్పారు. ఆయన రచనలలో మైలురాయి అయిన మహా ప్రస్థానం చరగని ముద్ర అన్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, అనే మాటలు రచనలలో తూటాల లెక్క ఉుండేవి అన్నారు. ఆయ నను, రచనను ప్రతి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలు అమలు పరచడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. 2024 ఎన్నికలలో కేంద్రంలోని బిజెపికి దేశంలో వ్యతిరేక పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర హక్కులను, విభజన హామీలు మరిచిన కారణంగా ప్రజలు ఎన్నికలలో చెంపపెట్టు లాగా తీర్పు ఇచ్చారన్నారు. గత ఎన్నికలలో రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమికి కనివేని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో సీట్లు ఇచ్చారన్నారు. దేశంలోని ఎన్డీయే కూటమి మన రాష్ట్రంలో ని తెలు గుదేశం పార్టీ పై ఆధార పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర హక్కులైన విభజన హామీలు, ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన సీమకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ వంటివి సాధన కోసం కషి చేయాలని కోరారు. కేంద్రంపై ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో రాజేష్‌, మహేష్‌, దర్శన్‌, హరి, సతీష్‌ పాల్గొన్నారు.కష్టజీవికి కుడిఎడమల నడిచేవాడే కవి కష్టజీవికి కుడి ఎడమల నడిచేవాడే కవి అని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లా కుమా రస్వామి అన్నారు. శుక్రవారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బ్రౌన్‌ గ్రంథాలయంలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కదిలేది కదిలించేది మార్చేది మార్పి ంచేది నవకవణానికి కావాలని శ్రీ శ్రీ కోరుకున్నారని అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ఈశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ కవిత్వం కార్మికులకు మార్చింగ్‌ బ్యాండ్‌ లాగా పనిచేస్తుందని అన్నారు. ఆయన సాహిత్యాన్ని మొత్తంగా అధ్య యనం చేశారన్నారు. రాజకీయాలపై ఆయన చెప్పిన విరులు ఈనాటికి సమకాలీనత సంతరి ంచుకున్నాయని అన్నారు. డాక్టర్‌ పొదిలి నాగరాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ కథలు ఎంతో సాహిత్య పరంగా తను రాసిన కవిత్వానికి మరో కోణంలో కథలను ఆవిష్కరించి కష్టజీవుల గురించి ఆయన తన కథల్లో పొందుపరిచారన్నారు. డిటెక్టివ్‌ పతలు కూడా ఆయన రాశారని అన్నారు.

➡️