అంగన్‌వాడీలకేదీ ఉద్యోగ భద్రత?

జిల్లాలో 2,704 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 2,624 మంది

కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన అంగన్‌వాడీలు (ఫైల్‌)

  • కనీస వేతనానికి నోచని వైనంపలు సమస్యలపై
  • ఏళ్ల తరబడి పోరునేటి నుంచి నిరవధిక సమ్మెఅంగన్‌వాడీ వర్కర్లు

ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించకుండా ఉత్త చేతులతోనే పంపుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, వాటిని అమలు చేయడానికి సిద్ధపడడం లేదు. వీటిపై అంగన్‌వాడీలు పలురూపాల్లో ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు. సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పాలకుల వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీలు నేటి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో 2,704 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 2,624 మంది హెల్పర్లు ఉన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 585 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. కార్యకర్తలకు నెలకు రూ.11,500, మినీ కేంద్రాల కార్యకర్తలు, సహాయకులకు రూ.ఏడు వేలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగున్నరేళ్లుగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనాల కంటే అదనంగా జీతాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. జీతాలు పెంచకపోగా, హామీలు అమలు చేయకపోగా వారిపై రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం పనిభారం పెంచుతోంది. యాప్‌ల్లో వివరాలు నమోదు చేయడం వారికి ప్రతిరోజూ సమస్యగానే మారింది. సిగల్స్‌ లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడంతో యాప్‌లతో ఇబ్బందులు పడుతున్నారు.యాప్‌లతో అవస్థలుఅంగన్‌వాడీల పనికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లతో కార్యకర్తలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్‌ యాప్‌, పోషణ ట్రాకర్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌, ఫేజ్‌ రికగేషన్‌ యాప్‌ వంటి నాలుగు రకాల యాప్‌లను తీసుకొచ్చింది. వాటిలో వివరాల నమోదుకు కార్యకర్తలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు నాసిరకమైనవి కావడంతో యాప్‌ డౌన్‌లోడ్‌, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సిగల్‌ సమస్య ప్రధానంగా ఉంది. యాప్‌లను ఉపయోగించడంలోనూ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు కోరుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు.ప్రధాన డిమాండ్లుఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలి.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి.మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. అప్పటివరకు మెయిన్‌ సెంటర్లలో పనిచేస్తున్న కార్యకర్తలకు చెల్లిస్తున్న మాదిరిగానే జీతాలు చెల్లించాలి.రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.ఐదు లక్షలకు పెంచడంతో పాటు ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలి.హెల్పర్ల ప్రమోషన్లకు నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యాన్ని నివారించాలి.సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలి. కనీస వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ మంజూరు చేయాలి. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలి. ప్రభుత్వమే గ్యాస్‌ను మంజూరు చేయాలి.మూడు యాప్‌లను రద్దు చేసి, ఒకే యాప్‌ ద్వారా విధులు నిర్వహించేలా చూడాలి.

 

➡️