‘అగ్రిగోల్డ్‌’ బాధితులకు అండ

తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని టిడిపి

వినతిపత్రం అందజేస్తున్న బాధితుల సంఘం నాయకులు

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు హామీ నిచ్చారు. కోటబొమ్మాళి టిడిపి కార్యాల యంలో అగ్రిగోల్డ్‌ కస్లమర్స్‌, ఏజెంట్ల వెల్ఫే ర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షు లు ఎం.జయసింహ ఆధ్వర్యాన అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, సంఘ నాయకులు శనివారం అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని 11 లక్షల అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన వెంటనే స్పందించి అగ్రిగోల్డ్‌ బాదితులకు నష్టం జరిగిందని మాకు తెలుసునని, సైకో ముఖ్యమంత్రి జగన్‌ అగ్రిగోల్‌ బాధితులకు ఎన్నికలు ముందు పాదయాత్రలో ఆదుకుంటానని మాట ఇచ్చి వారి సమస్య పట్టించుకోలేదని అన్నారు. అయితే 2024లో టిడిపి అధికారం లోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను టిడిపి మేనిఫోస్టోలో పెట్టి అందరికీ న్యాయం చేస్తామని హామీఇచ్చారు. అప్పటి వరకు ఎవ్వరు అధైర్యపడవద్దుయని, ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని అగ్రిగోల్డ్‌ ఏజెంట్లుకు, బాధితులకు కోరారు. కార్యక్ర మంలో అగ్రిగోల్డ్‌ కస్లమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ మహిళా కార్యదర్శి అరెలమ్మ, జిల్లా కార్యదర్శి కె.శ్రీను, సభ్యులు గుడ్ల రవికుమార్‌, నారా యణరావు, అప్పలస్వామి, బి.మోహనరావు, ఇ.భాస్కరరావు, కె.రాజారావు పాల్గొన్నారు.

 

➡️