ఎన్నికల నిబంధనలు తప్పనిసరి

అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని

పలాస : సమావేశంలో మాట్లాడుతున్న భరత్‌ నాయక్‌

ప్రజాశక్తి- పలాస

అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎన్నికల కోడ్‌ సక్రమంగా అమలయ్యేలా అధికారులు పనిచేయాలని ఆర్‌డిఒ డాక్టర్‌ భరత్‌ నాయక్‌ అన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో డివిజన్‌లోని తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడవద్దని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, హోర్డింగులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తి సౌకర్యాలు కల్పించామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా సంబంధిత ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం 6302384049 ప్రత్యేక నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి ఐటి విభాగంపై శిక్షణఅసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఐటి అంశాలపై తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆర్‌డిఒ ప్రారంభించారు. పోలాకి: ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి అనుసరించేలా చూడాలని డిటి పి.శ్రీనివాసరావు అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో బిఎల్‌ఒలతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విఆర్‌ఒలు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.మెళియాపుట్టి: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో ఎంపిడిఒ భాస్కరరావు సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ టి.రాజేష్‌, ఎంఇఒలు ఎస్‌.దేవేందర్రావు, ఎం.పద్మనాభరావు, విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️