ఒపిఎస్‌ ముద్దు

యుటిఎఫ్‌ మండల మహాసభను నందిగామ మండల పరిషత్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఈ మహాసభకు ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె.దాలయ్య హాజరై మాట్లాడుతూ అధికారంలోకి వచ్చివ వారంలో సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేస్తానన్న సిఎం నాలుగేళ్లు

నౌపడ : ప్రతిజ్ఞ చేస్తున్న యుటిఎఫ్‌ నూతన కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి- నందిగాం

యుటిఎఫ్‌ మండల మహాసభను నందిగామ మండల పరిషత్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఈ మహాసభకు ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె.దాలయ్య హాజరై మాట్లాడుతూ అధికారంలోకి వచ్చివ వారంలో సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేస్తానన్న సిఎం నాలుగేళ్లు దాటినా ఒపిఎస్‌ అమలుచేయలేదని, ఇప్పటికైనా జిపిఎస్‌లను రద్దుచేసి ఉద్యోగులందరినీ ఒపిఎస్‌లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఐక్య ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయ నియామాకాలు చేపట్టి విద్యావ్యవస్థను కాపాడాలని ప్రభుత్వానికి సూచనచేశారు. అనంతనం యుటిఎఫ్‌ నూతన కమిటీ ఎన్నిక చేపట్టారు. గౌరవాధ్యక్షులుగా జె.చంద్రశేఖరరావు. అధ్యక్షులుగా కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా వై.గణపతి, సహాధ్యక్షులుగా పి.వేణు, ఎం.బాలామణిలు, ట్రెజరర్‌గా బాపూజీలతో పాటు 15 మంది మండల కార్యదర్శులను, 6 గురు జిల్లా కౌన్సిలర్లను, ఇద్దరు ఆడిట్‌ కన్వినర్లగాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. ధర్మారావు, టెక్కలి యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి టి.వైకుంఠరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నౌపడ: మండలం నూతన యుటిఎఫ్‌ కార్యవర్గాన్ని యుటిఎఫ్‌ సభ్యులు ఎన్నుకున్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎర్నాగుల వాసుదేవరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి గుండు సూర్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన యుటిఎఫ్‌ కమిటీకి గౌరవ సలహాదారునిగా లఖినాన వెంకటరమణ, గౌరవ అధ్యక్షులుగా కానూరు ఆనందరావు, అధ్యక్షులుగా కుసుమూరు పాపారావులను ఎన్నుకున్నారు. సహాధ్యక్షులుగా పిల్లల ఫాల్గుణరావు, చదువుల మాలతి, ప్రధాన కార్యదర్శిగా దేవాది గణపతిరావు, కోశాధికారిగా యర్నాగుల సింహాచలం ఎన్నికయ్యారు. వీరితో పాటు 13 మంది కార్యదర్శులు, 11 మంది జిల్లా కౌన్సిలర్లు నియమించుకున్నారు. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా తిప్పాన నారాయణరెడ్డి, సిపిఎస్‌ కమిటీ కన్వీనర్‌గా బడగల వెంకటగిరి, మహిళా కమిటీ కన్వీనర్‌గా మాదాసు మీనాక్షి ఎంపికయ్యారు. ఈ మేరకు నూతనంగా ఎన్నుకోబడిన యుటిఎఫ్‌ మండల శాఖ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

 

➡️