క్రీడలతోనే మానసికోల్లాసం

క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం మండలంలో కనుగులవలసలో ఆడుదాం ఆంధ్రా పోటీలను

ఆమదాలవలస : క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతున్న స్పీకర్‌ సీతారాం

శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం మండలంలో కనుగులవలసలో ఆడుదాం ఆంధ్రా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలు క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకే క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, డిసిసిబి డైరెక్టర్‌ బొడ్డేపల్లి నారాయణరావు, ఎంపిటిసి ప్రతినిధి పొన్నాడ కృష్ణారావు, గురుగుబెల్లి నీలారావు పాల్గొన్నారు.మెళియాపుట్టి: ఆడుదాం ఆంధ్రా క్రీడలను సుందరాడ పాఠశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి శనివారం ప్రారంభించారు. క్రీడల్లో నైపుణ్యత గల వారిని గుర్తించేందుకు ఈ క్రీడలు దోహదమవుతాయన్నారు. క్రీడలు యువతకు మానసిక ఉల్లాసానికి దోహదమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కార్యాలయ ఇఒ తిరుపతి పట్నాయక్‌, భాస్కరదాస్‌, జయముని, అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.కవిటి: ఆడుదాం ఆంధ్ర క్రీడాపోటీలు మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శిలగాం సచివాలయం పరిధిలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యువ క్రీడాకారులను గుర్తించే కోవలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కడియాల బాబురావు, కరగాన వల్లభరావు, పంచాయతీ కార్యదర్శి మన్మధరావు, స్థానిక నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

➡️