ఖరీఫ్‌కు సిద్ధమయ్యేనా?

వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 ప్రాజెక్టు పనులకు రూ.933.90 కోట్లతో 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు పనులను

అసంపూర్తిగా హిరమండలంలోని వంశధార రిజర్వాయరు పనులు

అసంపూర్తిగా వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 పనులు

ఒప్పంద కాలపరిమితి జూన్‌ వరకు పొడిగింపు

పెండింగ్‌లో భూసేకరణఅఖరీఫ్‌ సాగునీరు విడుదలపై నెలకొన్న సందేహాలు

వంశధార ప్రాజెక్టును జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఖరీఫ్‌కు సాగునీళ్లపై అనేక సందేహాలు నెలకొన్నాయి. గతేడాది డిసెంబరు 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. పనులు మరో పది శాతం పెండింగ్‌లో ఉండటంతో ఈ ఏడాది జూన్‌ వరకు పొడించారు. వర్షాకాలం, తుపాన్లు వంటి ఆటంకాలు ఇప్పుడు లేకపోవడంతో పనులు చేపట్టేందుకు అనువుగా ఉంది. ప్రాజెక్టు కొన్నిచోట్ల భూమిని సేకరించినా రైతులకు డబ్బులు చెల్లించలేదు. దీంతో కాలువ తవ్వకాల పనులు ముందుకు సాగడం లేదు. వంశధార పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థలకు బిల్లుల బకాయిలు ఉండటంతో పనుల పూర్తి చేయడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 ను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించినా అవి నెరవేరేటట్లు కనిపించడం లేదు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 ప్రాజెక్టు పనులకు రూ.933.90 కోట్లతో 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు పనులను 87,88 ప్యాకేజీలు, హిరమండలం రిజర్వాయరు పనులుగా విభజించారు. 87 ప్యాకేజీ పనులను హర్విన్‌ కనస్ట్రక్షన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు, 88 ప్యాకేజీ పనులను శ్రీనివాస కనస్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌కు, హిరమండలం రిజర్వాయరు పనులను సోమ-పటేల్‌ కంపెనీకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 2008 జూలై నాటికి 87 ప్యాకేజీ పనులు 31 శాతం, 88 ప్యాకేజీ పనులు 36 శాతం పూర్తయ్యాయి. హిరమండలం రిజర్వాయరు పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ప్రాజెక్టు పనుల అంచనాలను రూ.1616.23 పెంచింది. 2019 వరకు 87 ప్యాకేజీ పనులు 64 శాతం, 88 ప్యాకేజీ పనులు 81 శాతం, హిరమండలం రిజర్వాయరు పనులు 87 శాతం పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.1650.20 కోట్లను ఖర్చు చేశారు. మందకొడిగా ప్రాజెక్టు పనులువైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమారు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2,671.52 కోట్లకు పెంచారు. రెండున్నరేళ్ల కాలంలో నిర్మాణ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. వీటిలో 87 ప్యాకేజీ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ.173.41 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.124.87 కోట్లు ఖర్చు చేశారు. లైనింగ్‌ పనులకు సంబంధించి ఇప్పటివరకు 7.63 కి.మీ. పూర్తి కాగా మరో 3.83 కిమీ మేర లైనింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అండర్‌ పాసేజ్‌లు, వంతెనలు తదితర నిర్మాణాలు 25 వరకు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 24 నిర్మించారు. ఒప్పంద కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించారు. 88 ప్యాకేజీ పనులు 94 శాతం పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ.192.66 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.156.83 కోట్లు ఖర్చు చేశారు. లైనింగ్‌ పనులకు సంబంధించి ఇప్పటివరకు 16.6 కి.మీ. పూర్తి కాగా, మరో 1.19 కి.మీ. మేర లైనింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అండర్‌ పాసేజ్‌లు, వంతెనలు తదితర నిర్మాణాలు 37 వరకు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 36 నిర్మించారు. ప్యాకేజీ పనులు 28, అక్టోబరు 2017 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వివిధ కారణాలతో పనులు సకాలంలో జరగకపోవడంతో ఆరు నెలలకొకసారి పొడిగించారు. పనులు పూర్తి చేసేందుకు చివరి సారిగా ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.అసంపూర్తిగానే రిజర్వాయరుహిరమండలం రిజర్వాయరు పనులు అంచనా వ్యయం రూ.419.03 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.376.31 కోట్లను వెచ్చించారు. మూడేళ్లలో పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. వంశధార ప్రాజెక్టు పూర్తికి అనేక పర్యాయాలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించినా ఏనాడు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం 28 అక్టోబరు 2017 నాటికి పూర్తి కావాలి. ఇప్పటివరకు 94.5 శాతం పనులు పూర్తయ్యాయి. 87 ప్యాకేజీ పనులు 90 శాతం, 88 ప్యాకేజీ పనులు 94 శాతం, హిరమండలం రిజర్వాయరు పనులు 94.50 శాతం పనులు జరిగాయి. ఇప్పటివరకు రూ.1987,53 కోట్లను ఖర్చుచేశారు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో అప్పటి నుంచి ఆరు మాసాలు చొప్పున పొడిగిస్తూ వచ్చారు. చివరి సారిగా ఈ డిసెంబరు 31 వరకు మరోసారి పొడిగించారు.పెండింగ్‌లో భూసేకరణవంశధార ప్రాజెక్టుకు సంబంధించి మరో వైపు భూసేకరణ కూడా పెండింగ్‌లో ఉంది. 87 ప్యాకేజీ కింద చేపడుతున్న కాలువ తవ్వకాలకు 71.32 ఎకరాల భూమి అవసరం. అధికారులు ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసినా సంబంధిత రైతులకు రూ.9.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోడంతో కాలువ తవ్వకాలు ముందుకు సాగడం లేదు. అదేవిధంగా 88 ప్యాకేజీ కింద చేస్తున్న కాలువ పనులకు 20.16 ఎకరాలు కావాల్సి ఉంది. రైతులకు రూ.2.92 కోట్లు చెల్లించాల్సి ఉంది. పనులు మందకొడిగా సాగుతుండటం, భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతో ఒప్పంద కాలపరిమితిని ఈ ఏడాది జూన్‌ వరకు పొడిగించారు. మరోసారి ఒప్పందం కాలపరిమితి పొడిగించాల్సిన పరిస్థితులు రావొచ్చనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఖరీఫ్‌కు నీళ్లిందించేలా చర్యలువంశధార ప్రాజెకు స్టేజ్‌-2, ఫేజ్‌-2 పనులను జూన్‌ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాజెక్టుకు అవసరమైన భూమికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిన వెంటనే కాలువ తవ్వకాలు చేపడతాం. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఖరీఫ్‌కు నీళ్లు అందించాలని అనుకుంటున్నాం. – డోల తిరుమలరావు, వంశధార ప్రాజెక్టు సర్కిల్‌ ఎస్‌ఇ

 

➡️