గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల

 

శ్రీకాకుళం : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మార్పు జ్యోతి అన్నారు. నగరంలోని పెద్దపాడులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదో తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎస్‌సి 70, ఎస్‌టి 5, బిసి 4, ఒసి 1, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి బైపిసి 40, ఎంపిసి 40 సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 23 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. మూడు, నాలుగు తరగతులు గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి, వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండి, సొంత జిల్లా వారు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 17 ఏళ్లు దాటని విద్యార్థులు అర్హులని స్పష్టం చేశారు.

➡️