జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం

సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఈ మేరకు మండలంలోని

ఎమ్మెల్యే కృష్ణదాస్‌

ప్రజాశక్తి- పోలాకిసిఎం జగన్మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఈ మేరకు మండలంలోని సోమవారం పలు అభివృద్ధి పనులకు, భవనాలను ప్రారంభించారు. ముందుగా తలసముద్రంలో రూ.70 లోలతో సచివాలయం, విలేజ్‌హెల్త్‌ సెంటర్‌, జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయిలను ప్రారంభించారు. ఈదులవలస నుంచి ముప్పిడి వరకు రూ.6.15 కోట్లతో బిటి రోడ్డు, రూ.11.80 లక్షలతో జలజీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభించారు. సంతలక్ష్మీపురం పంచాయతీలో రూ.47 లక్షలతో ఇంటింటికీ కుళాయి, రూ.పది లక్షలతో సచివాలయం భవనం ప్రారంభించారు. పల్లిపేట పంచాయతీలో రూ.25 లక్షలతో సచివాలయం భవనం ప్రారంభించారు. కొత్తరేవు పంచాయతీలో రూ.40 లక్షలతో సచివాలయం, రూ.20.80 లక్షలతో విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌, రూ.21.80 లక్షల తో రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. రేగుపాడు, బెలమర, చెల్లాయివలస, గంగివలస గ్రామాల్లో సచివాలయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, వైసిపి నాయకులు ఆర్‌.త్రినాథరావు, కణితి సత్తిబాబు, చింతాడ ఉమా, చింతు రాఘవ, ఎస్‌.సోమేశ్వరరావు, బి.గడ్డియ్య, బొజ్జ జగన్నాథం, బోసు రమణ, మిత్తన శ్రీను, కె.శ్రీను పాల్గొన్నారు.

➡️