జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు కె.కె.రాజపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల

పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- బూర్జ

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు కె.కె.రాజపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం వై.మాలతి తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అంతర్‌ జిల్లా ఆర్థరైటిక్స్‌ 60 మీటర్ల పరుగు పందెంలో సలాదుల తులసి అండర్‌-14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే 16 సంవత్సరాల విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో సాసుబిల్లి మాధురి ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిద్దరూ ఈనెల 18 నుంచి గుజరాత్‌లో జరగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. విద్యార్థులు జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల పిఇటి ఇ.అప్పన్న, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు పి.సుందర్రావు, ఎంవి.రమణ, బి.సాంబమూర్తి, బి.మాధవరావు, హరిబాబుతో పాటు ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు. విద్యార్థులకు పిఎల్‌ దేవీపేట యూత్‌సభ్యులు ఆర్థికసాయాన్ని అందజేశారు.

 

➡️