జాబ్‌ కార్డుదారులకు వంద రోజుల పని

జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డుదారులకు వందరోజులు పని కల్పించాలని డ్వామా పీడీ చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబంధించి

సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు

లావేరు: జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డుదారులకు వందరోజులు పని కల్పించాలని డ్వామా పీడీ చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబంధించి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఉపాధి కూలీకి 100 రోజులు పని కల్పించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి వికలాంగులకు పూర్తిస్థాయి పనులు కల్పించాలని, ఎన్‌ఎంఎం యాప్‌ ద్వారా ప్రతిరోజు హాజరు పంపించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. సమావేశంలో ఎంపిడిఒ కుప్పిలి సురేష్‌ కుమార్‌, ఎపిఒ సత్యవతి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు విధి నిర్వాహణలో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని ఎంపిడిఒ ఫణీంద్రకుమార్‌ అన్నారు. శనివారం ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకులకు, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధిహమీ పనులు ప్రారంభించి ప్రతి కుటుంబానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సంబంధిత రికార్డుల నవీకరణ, జాబ్‌కార్డులు నవీకరణ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పండ్లతోటలు పెంచేందుకు ఆసక్తికరంగా ఉండే రైతులను గుర్తించి మునగ, మామిడి, జీడి, కొబ్బరి పంటలను వేసేందుకు వారికి అవగాహన కల్పించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎపిఒ అరుణ్‌ కుమార్‌, క్లస్టర్‌ జెఇ హరిప్రసాద్‌, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.

 

➡️