నాలుగో రోజుకు శిబిరాలు

స్థానిక ఎల్‌విఆర్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సేవా

కొత్తూరు : మొక్కలు నాటుతున్న కృష్ణారావు, సింహాద్రినాయుడు, విద్యార్థులు

ప్రజాశక్తి- నరసన్నపేట

స్థానిక ఎల్‌విఆర్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సేవా శిబిరం నాల్గవ రోజు గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 22 మంది వాలంటీర్లుతో పాటు ప్రిన్సిపాల్‌ ప్రసాదరావు, పిఒ మోహనరావు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేయడం వలన వచ్చే లాభాలు, రక్తదానం ఏ వయసు వారు చేయొచ్చునన్న అంశాలపై ప్రిన్సిపాల్‌ ప్రసాదరావు, పిఒ మోహనరావు అవగాహన కల్పించారు. అనంతరం మోక్ష బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రిన్సిపాల్‌, పిఒను జ్ఞాపకతో సన్మానించారు. కార్యక్రమంలో మోక్ష బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కోటీశ్వరరావు, శ్యామ్‌సుందర్‌, సిబ్బంది కళ్యాణి, రాంబాబు, వలంటీర్లు పాల్గొన్నారు.కొత్తూరు: మండలంలోని గురండిలో శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎన్‌ఎస్‌ విద్యార్థులు 4వరోజు కార్యక్రమంలో భాగంగా పాఠశాల, దేవాలయం ప్రాంగణంలో కళాశాల డైరెక్టర్‌ డైరెక్టర్‌ జి.కృష్ణారావు, సర్పంచ్‌ బోర సింహద్రినాయుడు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన పర్యావరణ పరిరక్షణ సమతుల్యత వస్తుందన్నారు. కార్యక్రమంలో పిఒలు చిరంజీవి, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️