నేడు ‘నిజం గెలవాలి’

నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెలుగుదేశం

భువనేశ్వరి

  • యాత్ర జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఈనెల నాలుగో తేదీన జిల్లా పర్యటించనున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పర్యటించి చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఉదయం పది గంటలకు రాజాంలోని జిఎంఆర్‌ అతిథిగృహం నుంచి బయలుదేరి ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలంలోని ధవళపేటలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడ్నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు భోజన విరామం అనంతరం ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం తోటవాడ, ఆమదాలవలస మండలం దన్నానపేట, పాత నిమ్మతొర్లాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఓదార్చుతారు. సాయంత్రం విశాఖపట్నం బయలుదేరుతారు. ఆమె రాక నేపథ్యంలో టిడిపి నాయకులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

➡️