పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం గోవిందరావు అధ్యక్షతన సోమవారం 1950 సంత్సరం నుంచి 2024 సంత్సరం

మెళియాపుట్టి: కలుసుకున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి- కొత్తూరు

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం గోవిందరావు అధ్యక్షతన సోమవారం 1950 సంత్సరం నుంచి 2024 సంత్సరం వరకు చదువుకున్న విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు. అలాగే రానున్న కాలంలో 75 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు మాట్లాడుతూ ఈ పాఠశాలకు ప్రహరీగోడకు నాడు నేడు పనులు మంజూరయ్యాయన్నారు. పాఠశాల ప్రధమ ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల్‌దాస్‌ నాయుడు మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేస్తే చేపట్టిన పని విజయవంతం అవుతుందన్నారు. ఈ వేడుకలకు కమిటీలు వేసి పాఠశాలలో 75 సంత్సరాల సమాచారం తీసుకొని వేడుకల్లో పొందుపరచడం ముఖ్యమన్నారు. దీనికి అందరి సహకారం అవసరమన్నారు. సంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తాతబాబు, లోతుగెడ్డ భగవాన్‌నాయుడు, కోయిలపు సంజీవరావు, విద్యా కమిటీ చైర్మన్‌ వడమ శ్రీను పాల్గొన్నారు. మెళియాపుట్టి: మెళియాపుట్టి మండల పరిషత్‌ ఉన్నత పాఠశాల 2008-2009 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2008-2009 విద్యా సంవత్సరంలో టెన్త్‌ చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికను నిర్వహించి పాఠశాలలో వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల స్థాయి విద్యను అభ్యసించిన రోజులు ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. తమ సహ విద్యార్థులు ఎవరైనా అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారికి అందరూ కలిసికట్టుగా ఆర్థికసాయం అందిస్తామని, అలానే పాఠశాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వేలూరి లోచన బాబు, గంగాడ ప్రదీప్‌ కుమార్‌, బండారు హరిప్రసాద్‌, పుండ్రు చంద్రశేఖర్‌, గాలి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

 

➡️