పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు రాష్ట్ర

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జెసి నవీన్‌

  • అదనపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హరేంద్ర ప్రసాద్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్‌ హరేంద్ర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పెండింగ్‌ దరఖాస్తులపై విజయవాడ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది మంది కంటే ఎక్కువ ఉన్న ఓటర్లు, వందేళ్లు నిండిన వాటిని పున: పరిశీలించి వారం లోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎటువంటి పెండింగ్‌ లేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ముసాయిదా జాబితా విడుదల చేసే అక్టోబరు 27వ తేదీ నాటికి 0-0 నంబరుతో ఉన్న 2,206 ఓటర్లను గుర్తించామని, వాటి సంఖ్యను 114కి తగ్గించగలిగామన్నారు. ఇంటి నంబరుతో 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న మిగిలిన మూడు ఇళ్లనూ త్వరలోనే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాటినీ సరిచేస్తామన్నారు. ఈ సంఖ్య అక్టోబర్‌ 27 నాటికి 1122 ఇళ్లకు 15,222 ఓటర్లుగా ఉండేదని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు పాల్గొన్నారు.

 

 

➡️