భోగికి దూరంగా పలు గ్రామాలు

లుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. ఆరుగాలం కష్టపడి

ప్రజాశక్తి – శ్రీకాకుళం / నౌపడ / పలాస

తెలుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చే సమయంలో నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండగను జరుపుకోవడం సంప్రదాయంలా వస్తోంది. వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగలను నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో సందడిగా జరుపుకుంటారు. వృత్తి, వ్యాపారులు, బతుకుతెరువు నిమిత్తం పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉన్నా సంక్రాంతి పండగకు రాని వారంటూ ఉండరు. అలాంటి మధురానుభూతులకు ఆలవాలమైన భోగి మంట వేడుకలకు కొన్ని గ్రామాలు తరతరాలుగా దూరంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండగను చేసుకోని గ్రామాలు ఇంచుమించు ఉండవు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తెల్లవారుజామునే ఆవుపేడతో ప్రత్యేకంగా చేసిన భోగి పిడకలతో గ్రామంలోని ఓ ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేసిన భోగి మంటల వద్దకు చేరి సందడిగా గడుపుతారు. పిల్లల విషయానికొస్తే ఆ ముచ్చటే వేరు. వారి ఆనందాన్ని వర్ణించలేం. అయితే నరసన్నపేట మండలంలో పలు గ్రామాల ప్రజలు భోగి పండగే తెలియదు. భోగి మంటలు వేయరు.ఆ గ్రామాల్లో…నరసన్నపేట మండలం బాలసీమ పంచాయతీ బసివలస, ఉర్లాం పంచాయతీ చింతువానిపేట, విఎన్‌పురం పంచాయతీ గోకయ్యవలస, చోడవరం, సుందరాపురం గ్రామాల ప్రజలకు భోగి పండగ అంటే ఏమిటో తెలియదు. బసివలసలో వందేళ్ల కిందట జరిగిన ఘర్షణ నేపథ్యంలో భోగిపండగ నిషేధించామని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ముక్కనుమ పండగ రోజు జరిగే కొమ్ముల (ఆవులను పూజించే) పండగ కూడా జరుపుకోరు. చింతువానిపేటలో కూడా భోగి పండగను జరుపుకోరు. కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. విఎన్‌పురం పంచాయతీ గోకయ్యవలసలోనూ భోగి పండుగ జరుపుకోరు. భోగిమంటలు వెలిగించరు. వందేళ్ల కిందట ప్రమాదవశాత్తూ భోగి మంటల్లో పిల్లి పడి మృతి చెందిందని, ఆ ఘటన అపశకునంగా భావించి భోగి వేడుకలు జరుపుకోమని గ్రామానికి చెందిన వృద్ధులు చెబుతున్నారు.ఆ గ్రామాలదీ అదే దారిసంతబొమ్మాళి మండలంలో యమాలపేట, చెట్లతాండ్ర, నౌపడ పంచాయతీలోని పాలనాయుడుపేటలోనూ భోగి పండగ చేసుకోరు. భోగి మంటలు వేస్తే ఆ గ్రామాల్లో ఏదో ఒక వింత అనుభవాలు ఎదురవుతుందన్న ప్రచారం బాగా ఉంది. యామాలపేటలో పూర్వీకులు ఒకసారి భోగి మంట వేస్తే, గ్రామంలోని పూరిపాకలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు చెప్తున్నారు. అప్పట్నుంచి ఆ గ్రామంలో భోగి మంటలు వేయడం ఆపేశారు. దాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. చెట్లతాండ్రలో పూర్వం భోగి మంటలు వెలిగిస్తే, దాని నుంచి వచ్చిన పొగ గ్రామ సమీపంలోని కొండ పైకి వెళ్లేది. ఆ పొగతో కొండపై ఉన్న పులి భయపడి గ్రామంలోకి చొరబడేదన్న ప్రచారం ఉంది. దీంతో గ్రామంలో భోగి మంట వేయడం మానేశారు. నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో భోగి మంట వేస్తే ఆ రోజు ఎవరో ఒకరు చనిపోతున్నారని భోగి మంటకు దూరంగా ఉన్నారు. ఇవి అప్పట్లో యాదృచ్ఛికంగా జరిగినా, అనాదిగా వస్తున్న ఆచారాన్ని ప్రస్తుత తరం కొనసాగిస్తోంది.లకీëపురంలోనూ అదే పరిస్థితి పలాస మండలం లకీëపురం గ్రామం కూడా కొద్ది సంవత్సరాలుగా భోగి పండగకు దూరంగా ఉంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో భోగి మంటలు వేస్తుండగా ఎక్కడ నుంచో వచ్చిన జంతువు మంటలో పడిపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అప్పట్నుంచి ఆ గ్రామంలో భోగి మంటలు ఆపేశారు.

➡️