మంత్రి బొత్సకు పరామర్శ

రాష్ట్ర విద్యాశాఖామంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యన్నారాయణను ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసిపి సీనియర్‌

బొత్స సత్యనారాయణను పరామర్శిస్తున్న ఎచ్చెర్ల వైసిపి నాయకులు

ప్రజాశక్తి- లావేరు

రాష్ట్ర విద్యాశాఖామంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యన్నారాయణను ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసిపి సీనియర్‌ నాయకులు లుకలాపు అప్పలనాయుడు పరామర్శించారు. ఇటీవల మంత్రికి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని లెంకోహిల్స్‌లోని మంత్రి స్వగృహంలో కలిసి పరామర్శించారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర బిసిసెల్‌ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి జరుగుళ్ల శంకరరావు, వైసిపి నాయకులు మీసాల జగన్‌, ఠాగూర్‌, పతివాడ గురునాయుడు ఉన్నారు.

 

➡️