మోగిన నగారా

ఎన్నికల సమరం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం

కవాత్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్‌పి తదితరులు

షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

నిర్వహణ ఏర్పాట్లల్లో అధికారులు

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు

షెడ్యూల్‌, ఎన్నికల సమాచారం

జిల్లాలో నియోజకవర్గాలు: 8 (శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం)నోటిఫికేషన్‌ విడుదల: ఏప్రిల్‌ 18, 2024నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3నామినేషన్ల పరిశీలన : మే 4ఉపసంహరణ ఆఖరు తేదీ : మే 6పోలింగ్‌ తేదీ : మే 20కౌంటింగ్‌ : జూన్‌ 4

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, అర్బన్‌

ఎన్నికల సమరం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 13న 175 నియోజకవర్గాల్లో ఒకేరోజు పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు కోసం ఏప్రిల్‌ 18న నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. జూన్‌ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్‌ రావడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. కోడ్‌ అమల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. విగ్రహాలకు ముసుగులు తొడిగారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో పురుష ఓటర్లు మంది ఉండగా, మహిళా ఓటర్లు మంది ఉన్నారు. వీరితో పాటు థర్డ్‌ జెండర్‌ ఓటర్లు మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఆమదాలవలసలో అత్యల్పంగా 2,36,847 మంది ఓటర్లు ఉన్నారు.ఎన్నికల కోడ్‌ అమలు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. కోడ్‌ అమలుకు అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో పలు చోట్లఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు.కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు నూతన కలెక్టర్‌ కార్యాలయం స్పందన భవనంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌లో మీడియా సెల్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ విభాగం, సోషల్‌ మీడియా విభాగం, ఫిర్యాదుల పరిశీలన విభాగం, అన్ని వేళలా ఫిర్యాదుల స్వీకరించేలా విభాగం ఏర్పాటు చేశారు. ప్రజల నుంఛి ఫిర్యాదులు స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబరు 18004256625 అందుబాటులో ఉంచారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పనిచేసేలా 1950 నంబరుతో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో 08942-240606, 08942-240589, 08942 – 295084 నంబర్లతో మరో ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేశారు. అలాగే జుఎaఱశ్రీ: షశీఎజూశ్రీaఱఅ్‌షవశ్రీశ్రీ9ఏస్త్రఎaఱశ్రీ.షశీఎకొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికలుజిల్లా పునర్వవస్థీకరణ తర్వాత ఇవే తొలి ఎన్నికలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఎస్‌సి, ఎస్‌టిలకు చెరో రిజర్వుడ్‌ స్థానాలు ఉండేవి. మిగిలిన ఎనిమిది సీట్లు జనరల్‌ కేటగిరిలో ఉండేవి. జిల్లాల విభజన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఒక్క స్థానమూ ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. అన్ని స్థానాలకూ వైసిపి అభ్యర్థుల ప్రకటనఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయా స్థానాలకు వైసిపి శనివారం ప్రకటించింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థినీ ప్రకటించింది. టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో మార్పులు చేయగా, మిగిలిన ఆరింటిలో పాత వారికే అవకాశం కల్పించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేయగా, ఆయన స్థానంలో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ను రంగంలోకి దించింది.నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థుల ఖరారుటిడిపి రెండు విడతలుగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలసకు అభ్యర్థులను ఖరారు చేసింది. రెండో జాబితాలో నరసన్నపేటకు అభ్యర్థిని ప్రకటించింది. జిల్లాకు సంబంధించి మరో నాలుగు స్థానాలకు అసెంబ్లీ, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. శ్రీకాకుళంలో పోలీసుల కవాతుఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నద్ధత తెలిపేలా శ్రీకాకుళం నగరంలో రిజర్వుడ్‌ పోలీసులు, స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ కూడలి నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు కవాతులో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, నగర పాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారీయా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ కేంద్ర దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని అన్నారు. జిల్లాలో ఫ్లాగ్‌మార్చ్‌లు, రూట్‌ మార్చ్‌లు, చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీల వంటి విధులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా పరిస్థితులు, భౌతిక స్వరూపం, స్థితిగతులను కేంద్ర దళాలకు మ్యాప్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి ప్రేమ కాజల్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఆర్‌డిఒ సిహెచ్‌. రంగయ్య, డిఎస్‌పిలు ఎల్‌.శృతి, వై.శేషాద్రినాయుడు, ఆర్‌పిఎఫ్‌ ఎస్‌పి, డిఎస్‌పిలు పాల్గొన్నారు. కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి వస్తుందని, నిబంధనలను ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం ఎస్‌పి జిఆర్‌ రాధిక, జెసి ఎం నవీన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణం వంటి అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ల ముందు రోజు వరకు కూడా అర్హులైన కొత్త ఓటర్లుగా జాబితాలో చేరుస్తామని చెప్పారు.

 

➡️