యుటిఎఫ్‌ కేలండర్లు ఆవిష్కరణ

స్థానిక హరిపురం పాఠశాలలో శుక్రవారం ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కేలండర్లు, పాకెట్‌ కేలండర్లు, డైరీలు, ఇతర ప్రచురణలను యుటిఎఫ్‌ మందస మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఇఒ లక్ష్మణరావు, హెచ్‌ఎం జి.ఉమారాజు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ప్రచురిస్తున్న కేలండర్లు, డైరీలు, ఎస్‌ఎస్‌సి మోడల్‌ టెస్ట్‌ పేపర్లు విద్యార్థి లోకానికి విలువైన సమాచారం

సోంపేట : కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- సోంపేట

స్థానిక హరిపురం పాఠశాలలో శుక్రవారం ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కేలండర్లు, పాకెట్‌ కేలండర్లు, డైరీలు, ఇతర ప్రచురణలను యుటిఎఫ్‌ మందస మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఇఒ లక్ష్మణరావు, హెచ్‌ఎం జి.ఉమారాజు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ప్రచురిస్తున్న కేలండర్లు, డైరీలు, ఎస్‌ఎస్‌సి మోడల్‌ టెస్ట్‌ పేపర్లు విద్యార్థి లోకానికి విలువైన సమాచారం అందించేవిగా ఉంటున్నాయని కొనియాడారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి గున్న రమేష్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ గుంట కోదండరావులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. జనవరి 3న జిల్లా కేంద్రంలో, 9, 10 తేదీల్లో విజయవాడలో యుటిఎఫ్‌ పోరుబాట కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీష్‌ బడిత్య, దాసరి ఈశ్వరరావు, పూర్వ జిల్లా కార్యదర్శి రాజాన పరమేశ్వరరావు, కోశాధికారి సోమనాథ్‌ సిష్టు, పూర్వ ప్రధాన కార్యదర్శిలు సోమేశ్వరరావు, కె మాధవరావు, సీనియర్‌ కార్యకర్తలు లండ రాజారావు, జన్ని సోమేశ్వరరావు, శ్రీనివాసరావు, నరసింహమూర్తి పాల్గొన్నారు.కంచిలి: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ 2024 నూతన సంవత్సర కేలండర్‌, డైరీలను సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఎంఇఒలు ఎస్‌.శివరామ ప్రసాద్‌, కె.చిట్టిబాబు చేతులమీదగా కేలండర్లతో పాటు డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ మెంబర్‌ సుదర్శన్‌ బెహరా, అధ్యక్ష, కార్యదర్శులు మురళీనాయక్‌, ఎన్‌.రవి, గౌరవ అధ్యక్షులు త్రినాధ్‌ సాహు, కోశాధికారి త్రినాధ్‌, ఎస్‌. వెంకటరావు, పి.పురుషోత్తం రెడ్డి, నిరంజన్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.నందిగాం: యుటిఎఫ్‌ కేలండర్‌ను విద్యాశాఖాధికారి జి.నరసింహులు, చిన్నవాడు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వె.ౖహరిబాబు, సిహెచ్‌ కృష్ణారావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.శంకరరావు శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమారస్వామి, గణపతిరావు ఉన్నారు.

 

➡️