రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యాన మాస్కుల పంపిణీ

కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో

మార్కులను పంపిణీ చేస్తున్న జగన్మోహనరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. మండలంలోని బుడుమూరు సంత, పరిసర గ్రామాల్లో చైతన్య రథం, పోస్టర్లను పంపిణీ చేపట్టారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహనరావు శ్రీకాకుళం నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వద్ద సుమారు వెయ్యి మందికి మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు రెడ్‌క్రాస్‌ చైతన్య రథం ద్వారా వాలంటీర్లు, యూత్‌ రెడ్‌క్రాస్‌ ద్వారా కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కో-ఆర్డినేటర్‌ కె. సత్యనారాయణ, సిబ్బంది సతీష్‌, పవన్‌ పాల్గొన్నారు.

 

➡️