రౌడీషీటర్లలో పరివర్తన రావాలి

రౌడీషీటర్లలో పరివర్తన రావాలి

మాట్లాడుతున్న సిఐ ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీషీటర్లుగా ముద్రపడిన యువకుల్లో పరివర్తన రావాలని రెండో పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హరికృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

➡️