వైసిపిలో వణుకు మొదలైంది

యువగళం ముగింపు సభకు వచ్చిన జనసంద్రాన్ని

మాట్లాడుతున్న రవికుమార్‌

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – పొందూరు

యువగళం ముగింపు సభకు వచ్చిన జనసంద్రాన్ని చూసి వైసిపి నాయకుల వెన్నులో వణుకు మొదలైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని దల్లిపేటలో గురువారం విలేకరులతో మాట్లాడారు. యువగళం ముగింపు సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. సభకు బస్సులను ఇవ్వకపోవడంతో పాటు అడుగుడుగునా ఆటంకాలు సృష్టించినా జగన్‌ కుట్రలను తెలుగు తమ్ముళ్లు పటాపంచలు చేస్తూ సభకు పోటెత్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఈ సభతో రుజువైందన్నారు. ఆరాచక వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఇరుపార్టీల ఉమ్మడి లక్ష్యమని తెలిపారు. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయనతో పాటు టిడిపి మండల అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్‌, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకర భాస్కరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న రంగా, దల్లిపేట మాజీ సర్పంచ్‌ రఘురాంరెడ్డి, మాజీ ఎంపిటిసి సన్యాసపరెడ్డి పాల్గొన్నారు.

 

 

➡️