సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాద్యాయ సంఘాల మద్దతు

మగ్రశిక్ష - విద్యాశాఖలో పనిచేస్తున్న

శిబిరంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

  • న్యాయ సమ్మతమైన సమస్యలను పరిస్కరించాలని డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమగ్రశిక్ష – విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని జ్యోతిరావుపూలే పార్కు వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎం.వాగ్దేవి సందర్శించి సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం తగదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని, ఎంటిఎస్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. శిబిరంలో యుటిఎఫ్‌ కార్యవర్గ సభ్యులు పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, పలు సంఘాల నాయకులు ఆదినారాయణ, ఢిల్లీశ్వరరావు, ధర్మారావు, సమగ్ర శిక్ష జెఎసి జిల్లా అధ్యక్షులు పైడి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️