సాగునీటికి సహకారం అందేనా?

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. వంశధార ప్రాజెక్టు

నిధుల కొరతతో సతమతమవుతున్న సాగునీటి ప్రాజెక్టులు

గత బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినా విడుదల కాని నిధులు

కొత్త పథకాలు, ప్రాజెక్టులపై జిల్లావాసుల ఎదురుచూపులుొ

నేడు అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నిధుల కొరతో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గత బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం, ఆ మేరకు నిధులు కేటాయించలేదు. ట్రిపుల్‌ ఐటి, బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీలకూ నిధుల కొరత వెంటాడుతోంది. వైసిపి ప్రభుత్వం పెట్టే ఆఖరి బడ్జెట్‌ ఇదే కావడంతో ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులపై జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 స్టేజ్‌-2కు అంచనా వ్యయం రూ.2407.79 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.1987.53 కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణ పనులు, భూ సేకరణకు కలిపి మరో రూ.420 కోట్లు ఇస్తే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. 87 ప్యాకేజీ పనులు 90 శాతం, 88 ప్యాకేజీ పనులు 94 శాతం పూర్తి కాగా, హిరమండలం రిజర్వాయర్‌ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులను 2017, మార్చిలో రూ.85 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి కావాల్సిన మేర నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం దాని అంచనా వ్యయం రూ.145.34 కోట్లకు చేరింది. ఇందులో ఇప్పటివరకు రూ.105.81 కోట్లు ఖర్చయింది. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. భూసేకరణకు రూ.8.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.852 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.325 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణకు సంబంధించి రూ.7.04 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.సాగునీటి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఇలా…వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌-2 పనులకు రూ.393.92 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. వంశధార-1 ప్రాజెక్టు నిర్వహణ పనులకు రూ.1.45 కోట్లు కావాలని అడిగారు. మడ్డువలస రిజర్వాయర్‌ నిర్వహణ, రెండో దశ పనులకు రూ.30 కోట్లు చొప్పున ప్రతిపాదనలు పంపారు.కరకట్టల పనులకు నిధులు దక్కేనా?కరకట్టల నిర్మాణానికి పెద్దఎత్తున భూమిని సేకరించాల్సి ఉండడం, భూసేకరణకు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వం 2019లో ఉన్నపళంగా కరకట్టలను రద్దు చేసింది. అత్యంత ప్రమాదరకరమైన ప్రాంతాల్లో వరద గట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను పంపాలని అధికారులకు సూచించింది. జిల్లాలో ఆ విధంగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు నాలుగేళ్లుగా ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. నాగావళి కరకట్టలకు సంబంధించి అధికారులు మొత్తం రూ.37.65 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వంశధార నదీ పరివాహక ప్రాంతంలో 22.77 కి.మీ మేర కరకట్టలను నిర్మించేందుకు రూ.77.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ట్రిపుల్‌ ఐటిని వెంటాడున్న మౌలిక వసతులుఎచ్చెర్లలోని ట్రిపుల్‌ ఐటికి సొంత గూడు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆరు వేల మంది విద్యార్థుల వసతికి అవసరమైన భవనాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.600 కోట్లు కావాల్సి ఉంది. శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన భవనాలను నెలకు రూ.ఆరు లక్షలకు అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. 2023-24 బడ్జెట్‌లో ట్రిపుల్‌ ఐటికి రూ.32 కోట్లు కేటాయించినా, పూర్తిస్థాయిలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.మూలపేట పోర్టుకు ఏమేర నిధులు కేటాయిస్తారో?మూలపేట పోర్టుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వంద కోట్లను కేటాయించింది. పునరావాసం, పరిహారం చెల్లింపులకు నిధులు అవసరమున్న నేపథ్యంలో పోర్టుకు ఈ బడ్జెట్‌లో ఎంతమేర నిధులు కేటాయిస్తుందో వేచిచూడాలి. అంబేద్కర్‌ యూనివర్సిటీ నిధులు కేటాయింపు జరిగేనా?ఎచ్చెర్లలోని బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీని నిధుల కొరత వెంటాడుతోంది. పరిపాలనా భవనం పూర్తయినా పురుషల వసతిగృహ నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.53.70 కోట్లతో అంచనాలు రూపొందించినా, నిధుల్లేక ప్రతిపాదనల దశలోనే ఉండిపోయాయి. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.నిధుల్లేక అడుగు పడని ఫిషింగ్‌ హార్బర్‌ పనులుఎన్నికల నేపథ్యంలో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ప్రతిపాదిత ఫిషింగ్‌ హార్బర్‌కు నిధులు కేటాయింపులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మూలపేట పోర్టు పనులు చకచకా సాగుతుంటే, దాంతోపాటే శంకుస్థాపన చేసిన ఫిషింగ్‌ హార్బర్‌ పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. హార్బర్‌ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల అనుమతులు ఇచ్చింది. హార్బర్‌ నిర్మాణం పూర్తయితే వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.

➡️