సిఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి

పలాస : కాశీబుగ్గ రైల్వే క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న నవీన్‌, రాధిక

* ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – పలాస, కంచిలి

ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌పి జి.ఆర్‌ రాధిక వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి పలాస, కంచిలి మండలాల్లో సిఎం పర్యటన రూట్‌ మ్యాప్‌, బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. భద్రతాపరమైన ముందస్తు ఏర్పాట్లపై అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైసెన్‌, కాన్వారును హెలీప్యాడ్‌, సభావేదిక వద్ద నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సిఎం రోడ్‌ షో ఉన్నందున కాశీబుగ్గ సాయిబాబా మందిరం ప్రాంతంలోని స్పీడ్‌ బ్రేకర్లను తొలగించాలని జెసి నవీన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ను ఆదేశించారు. సిఎం వాహనం బహిరంగ సభ లోపలకు వచ్చేందుకు ర్యాంప్‌ ఏర్పాటు చేయాలన్నారు. పలు అంశాలకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్‌పి రాధిక మాట్లాడుతూ జాతీయ రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం నుంచి తిరుగు ప్రయాణం వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పలు శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పలాస ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌, డిఇఒ కె.వెంకటేశ్వరరావు, కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వర్‌ రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️