సుప్రీం తీర్పును వక్రీకరిస్తున్నారు

చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును వైసిపి నాయకులు వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

నిరాధార ఆరోపణలతో చంద్రబాబుపై కేసులు

టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును వైసిపి నాయకులు వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ఆరోపించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేశారని గుర్తుచేశారు. సెక్షన్‌ 17ఎ అవినీతి నిరోధక చట్టం 1988ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు వర్తింపజేయడంపై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తదుపరి చర్యల కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదించారని తెలిపారు. 2018 జూన్‌ 5న ఎసిబికి అందిన లేఖ దర్యాప్తు కోసం పంపిన విజ్ఞాపన మాత్రమేనని, దర్యాప్తుపై నిర్దిష్టమైన ఆర్డర్‌ కాదన్నారు. ఈ కేసులో నిధులు దారిమళ్లినట్టు గానీ, చంద్రబాబుకు తిరిగి ఆ నిధులు వెళ్లినట్టు గానీ ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు. అవినీతి నిరోధక చట్టం సవరణ ద్వారా వచ్చిన సెక్షన్‌ 17ఎ అమలుకు ముందు చంద్రబాబుపై ఏ రకమైన విచారణ, దర్యాప్తు, పరిశోధన జరగలేదని చెప్పారు. న్యాయస్థానంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. కేవలం ఉద్దేశపూరక్వగా కక్షసాధింపు ధోరణితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సిఐడిని తన జేబు సంస్థగా వాడుకుని కేసులు పెట్టారని ఆరోపించారు. తుది తీర్పు సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️