27 నుంచి ‘నాక్‌’ పర్యటన

ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నాక్‌ బృందం

మాట్లాడుతున్న ఛాన్సలర్‌ కె.సి రెడ్డి

  • ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నాక్‌ బృందం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటిని పరిశీలించనుందని ఆర్‌జియుకెటి ఛాన్సలర్‌ కె.సి రెడ్డి తెలిపారు. నాక్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు, అధ్యాపకులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరేళ్లుగా ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విద్యను అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రెసిడెన్షియల్‌ యూనివర్సిటీ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ అని తెలిపారు. యూనివర్సిటీకి నాక్‌ గ్రేడ్‌ వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. సమావేశంలో ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వెంకట గోపాల ధన బాలాజీ, ఒఎస్‌డి ఎల్‌.డి సుధాకర్‌బాబు, పరిపాలనా అధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహనకృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ అధికారి అసిరినాయుడు, డీన్‌ వెల్ఫేర్‌ గేదెల రవి, సిహెచ్‌.వాసు పాల్గొన్నారు.

 

 

➡️