మాస్టర్‌ ట్రైనర్‌ శేషగిరికి అభినందన

న్నికల విధులు నిర్వహించిన

శేషగిరిని అభినందిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించి, జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన జిల్లాస్థాయి మాస్టర్‌ ట్రైనర్‌, ఉపాధ్యాయుడు కె.శేషగిరిరావును కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అభినందించారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకులు, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల సంతకాలతో కూడిన అభినందన ప్రశంసా పత్రాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం అందజేశారు. శేషగిరి ప్రస్తుతం గార మండలం ఉప్పరవానిపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. విజయవాడలో శిక్షణ పొందిన ఆయన జిల్లాస్థాయి ఎన్నికల నియమాలను, విధులను మాస్టర్‌ శిక్షకుని హోదాలో నాలుగు నెలలుగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 2019లోనూ ఆయన శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి మాస్టర్‌ శిక్షకులుగా వ్యవహరించారు. అనంతరం ఆయన జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ను కలిశారు.

➡️