ఫౌంటెయిన్‌ కాదు… ఉద్దానం నీటి పైపు

మండలంలోని సహలాలపుట్టుగ పంచాయతీలో ఇటీవల

ఎగసిపడుతున్న తాగునీరు

ప్రజాశక్తి- కవిటి

మండలంలోని సహలాలపుట్టుగ పంచాయతీలో ఇటీవల వేసిన ఉద్దానం పైపులైను నుంచి తాగునీరు ఎగసిపడుతోంది. గత 20 రోజులుగా ఫౌంటెన్‌ మాదిరిగా నీరు ఎగసిపడుతున్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడంతో నీరు వృథాగాపోతోంది. దీనిపై స్థానిక సర్పంచ్‌ ప్రతినిధి రవిప్రధాన్‌ సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ కనీసం వచ్చి చూసిన పరిస్థితి లేదని వాపోయారు. దీంతో స్థానికంగా ఉంటున్న రైతులు వాటికి గుడ్డలు కట్టి తమ పశువుల అవసరాల కోసం వాడుకుంటున్నారు. కేవలం అక్కడే కాకుండా మండలంలో చాలా ప్రదేశాల్లో కొత్తగా వేసిన ఉద్దానం తాగునీటి పథకం పైపులైను లీకై నీరు వ్యర్థమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల డి.జి.పుట్టుగలో పైపులైను మరమ్మతులకు గురై నెల రోజుల పాటు నీరు వృథాగాపోయింది. గ్రామస్తుల ఫిర్యాదుతో తరువాత దానికి మరమ్మతులు చేశారు. ఇప్పటికైనా మండల వ్యాప్తంగా కొత్తగా వేసిన తాగునీటి పైపులైను పరిశీలించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

➡️