ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

కాలుష్య కోరల నుంచి

మొక్కలు నాటుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

కాలుష్య కోరల నుంచి బయటపడేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రకృతిలో సమతుల్యత కోల్పోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో చాలా సమస్యలకు గురవుతామన్నారు. అటువంటి సమస్యను అధిగమించాలంటే ప్రస్తుతం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ఎం ఫణికుమార్‌, శాశ్వత లోక్‌అదాలత్‌ చైర్మన్‌ జి.సువర్ణరాజు, ఎఎస్‌పి వి.ఉమామహేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️