స్ఫూర్తి ప్రదాత జగ్జీవన్‌రామ్‌

అణగారిన ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన ఆదర్శమూర్తి

శ్రీకాకుళం అర్బన్‌ : చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న డిఆర్‌ఒ గణపతిరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

అణగారిన ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన ఆదర్శమూర్తి బాబూ జగ్జీవన్‌రామ్‌ అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అన్నారు. కలెక్టరేట్‌లో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ సామాజిక స్పృహతోనే సామాన్యుడు అసమాన్యుడుగా ఉద్భవిస్తారన్నారు. రాజకీయాల్లో అతని జీవితం స్ఫూర్తి దాయకమన్నారు. విద్యావేత్తగా, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసిన భారత తొలి దళిత ఉపప్రధాని అని కొనియాడారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్‌రెడ్డి, డిఇఒ కె.వెంకటేశ్వరరావు, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి గడ్డెమ్మ, జిల్లా చీఫ్‌ కోచ్‌ శ్రీధర్‌, జిల్లా పర్యటక అధికారి నారాయణరావు, సెటశ్రీ సిఇఒ ప్రసాదరావు, డిఐపిఆర్‌ఒ కె.చెన్నకేశవరావు పాల్గొన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యాన…అరసవల్లి కూడలిలో జగ్జవన్‌రామ్‌ విగ్రహానికి దళిత సంఘాల జెఎసి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కల్లేపల్లి రామ్‌గోపాల్‌, మిస్కా కృష్ణయ్య, గణేష్‌, బొడ్డేపల్లి భూపతిరావు పాల్గొన్నారు. టిడిపి ఆధ్వర్యాన…అరసవల్లిలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి జగ్జవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఎచ్చెర్ల : రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వహించిన జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.వి.జి.డి.బాలాజీ, ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఆసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ గేదెల రవి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రాం ఆఫీసర్లు వావిలపల్లి సింహాచలం, డాక్టర్‌ బి.శ్రీధర్‌, డాక్టర్‌ రాకోటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.పలాస: కాశీబుగ్గ సంత మైదానంలో దళితహక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పిలక కృష్ణారావు, అధ్యక్షులు తెప్ప పాపారావు, కార్యదర్శి నగిరి తారకరామారావు, ట్రెజరర్‌ కోన రవికుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ వుర్ణాన అప్పలరాజు, దుర్యోధన మాస్టారు, బోనెల ప్రవీణ్‌ కుమార్‌, కమిటీసభ్యులు పాల్గొన్నారు.ఆమదాలవలస: మండలంలోని గాజుల కొలివలసలో ఎంఆర్‌పిఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు లోపింటి నారాయణరావు ఆధ్వర్యంలో బాబు జగజీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో రాడ విజరుకుమార్‌, సవలాపురపు భాస్కరరావు, రామారావు, కుర్మాన గణేష్‌, అశోక్‌, ప్రతాప్‌, కుర్మాన అశోక్‌, ఉర్లాపు విజరు, నవిరి శ్రీను పాల్గొన్నారు.

 

➡️