లేకుంటే అనర్హత వేటు

సార్వత్రిక ఎన్నికల్లో కీలక

ఎన్నికల ఖర్చుపై లెక్కలు పక్కా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. నామినేషన్‌ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు అయిన ఎన్నికల ఖర్చును అభ్యర్థులు పక్కాగా చూపాల్సిందే. ఫలితాలు వెల్లడయ్యే లోపు వీటిని అభ్యర్థులు అప్పగించాల్సి ఉంటుంది. శాసనసభ ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలి, లోక్‌సభ ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలన్నది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 19లో వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి వ్యయ పరిమితి రూ.40 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు చేసే ఖర్చుపై వివరాలను ఎప్పటికప్పుడు షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేశారు. నిర్ణీత వ్యయ పరిమితికి మించి ఒక్క రూపాయి ఖర్చు దాటినా, అందుకు సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 10ఎ ప్రకారం పోటీ చేసిన వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వచ్చే మూడేళ్ల పాటు స్థానిక, శాసనసభ ఎన్నికలతో సహా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేస్తుంది. వ్యయ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ గణాంకాలను పరిశీలిస్తారు. దేనికి ఎంత ఖర్చు చేయాలో గతంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. దాని ఆధారంగానే లెక్కలు చూపాల్సి ఉంటుంది.

➡️