రాష్ట్రాన్ని ప్రజలే రక్షించుకోవాలి

దివాళా తీసిన రాష్ట్రాన్ని

ప్రచారం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, రవికుమార్‌

  • ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – ఆమదాలవలస

దివాళా తీసిన రాష్ట్రాన్ని ప్రజలే రక్షించుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని కొర్లకోటలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సనపల ఢిల్లేశ్వరరావు ఆధ్వర్యాన బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి చేతకాని పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో విధ్వంసమే తప్ప అభివృద్ధి ఎక్కడా కానరాలేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని, చివరకు కొండలు, గుట్టలను సైతం విడిచిపెట్టలేదన్నారు. రాష్ట్రం కోలుకోవాలంటే మరో 20 ఏళ్లు పడుతుందన్నారు. చైతన్యవంతులైన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని తరిమికొట్టి తమను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, కూటమి నాయకులు పేడాడ రామ్మోహనరావు, సూరపు నాయుడు, కణితి విజయలక్ష్మి భారు, నూక రాజు, ఎంపిటిసి అన్నెపు భాస్కరరావు, సర్పంచ్‌ సనపల అన్నపూర్ణ, తమ్మినేని చంద్రశేఖర్‌, విద్యాసాగర్‌, మెండ దాసునాయుడు, మెట్ట సుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️