రక్తదాన శిబిరానికి స్పందన

మండల కేంద్రంలో సూర్య ఆస్పత్రి వద్ద సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో

రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి- రణస్థలం

మండల కేంద్రంలో సూర్య ఆస్పత్రి వద్ద సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 107 మంది రక్తదానం చేసారు. శిబిరాన్ని ఫౌండేషన్‌ సభ్యుడు మహమ్మద్‌ తాజ్‌ మొహిద్దీన్‌ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైనా మండు వేసవిని సైతం లెక్కచేయకుండా ఇంతమంది రక్తదానం చేయడం గర్వకారణమన్నారు. ఈ శిబిరంలో ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షులు ఇవి సత్యన్నారాయణ, అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు. వేసవిలో రక్త నిల్వలు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపిపి రాయపురెడ్డి భుజంగరావు, జెఆర్‌ పురం సర్పంచ్‌ భవిరి రమణ, సెక్రటరీ లింగాల ఆదినారాయణ, మజ్జి రమేష్‌, గొర్లె స్వామి నాయుడు, ముల్లు రాంబాబు, ఇజ్జు శ్రీనివాసరావు, రాయపురెడ్డి శ్రీనివాసరావు, మిండ్రాన రామారావు, దన్నాన రమణ, పసుపురెడ్డి సురేష్‌, మహంతి గురునాయుడు, చోడిశెట్టి చంద్రశేఖర్‌, కూనిబిల్లి సత్యారావు, వార్డు మెంబర్‌ కరిమజ్జి నాగభూషణం, న్యూశ్రీకాకుళం బ్లడ్‌ బ్యాంకు మేనేజర్‌ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️