ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చించాలి : డివైఎఫ్ఐ 

Jan 8,2024 18:03 #Kurnool
ssa employees strike
  • 20వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు 

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : గత 20 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాలుగున్నర సంవత్సరాల వివిధ రూపాల్లో శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేసిన ప్రభుత్వం స్పందించని కారణంగా సమ్మెకు వెళ్లవలసి వచ్చిందని ఈ సమ్మెకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల నాయకులతో చర్చలు చేసి పరిష్కరించాలని లేదంటే డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మద్దతుగా ఉంటామని డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుస్సేన్ బాషా హెచ్చరించారు. జేఏసీ జిల్లా నాయకులు సోమేశ్వరి భీమేష్ అనంత రాములు రమణ వీరారెడ్డి మంజుల మాట్లాడుతూ 5న జరిగిన చలో విజయవాడ పోరాటంలో ఎస్ పి డి వాగ్దానాన్ని తక్షణమే జయిస్తూ చర్చలు చేయాలని లేదంటే మరొకసారి చలో విజయవాడకు కుటుంబాలతో తరలివస్తామని ఎస్ పి డి కి హెచ్చరించారు జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షులు అధ్యక్షులు జయ నాగేశ్వరరావు ,రాజు భాస్కర్ రఫీ సత్యవతి రవి వెంకట్ రాముడు మల్లేశ్వరి తదితరులు సంఘీభావం తెలియజేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల యూనియన్ జిల్లా నాయకులు కే భారతి లీలావతి సరోజమ్మ అనసూయ లలితమ్మ ఉరుకుందమ్మా దేవమ్మ సువార్తమ్మ సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు.

➡️