వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Apr 29,2024 20:53

ప్రజాశక్తి – భోగాపురం : వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కౌలువాడ, తూడెం, రావాడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ రాజధాని అయితే మన ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే విమానాశ్రయం పనులు జరుగు తుండగా మెట్రో కూడా డిపిఆర్‌ తయారు చేశారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. అందుకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎమ్‌పిగా బి చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రావాడ బాబు, సర్పంచ్‌ పైడి నాయుడు, గాలి రాజారెడ్డి, వాసుబాబు, కొత్తయ్యరెడ్డి, డి శ్రీనివాస్‌ రాజు, ఉప్పాడ శివారెడ్డి, పడాల శ్రీనివాసరావు, భాను, సుందర హరీష్‌, బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, యర్రప్పల నారాయణ, కొల్లి రామ్మూర్తి, రమేష్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.’మీ సత్తెన్నను మరోసారి దీవించండి’ : బొత్స మెరకముడిదాం: వచ్చేనెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో చీపురుపల్లి నుంచి వైసిపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మీ సత్తెన్న (బొత్స సత్యనారాయణ)ను, ఎమ్‌పి పోటీ చేస్తున్న బెల్లాన చంద్ర శేఖర్‌ను ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్‌ బొత్స సందీప్‌ ఓటర్లను కోరారు. మండలంలోని బుధరా యవలస, బైరిపురం, చిన బంటుపల్లి గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులు వద్దకు వెళ్లి సోమవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ దగ్గరికే సంక్షేమ పథకాలు రావాలన్నా బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా, జగన్మోహన్‌ రెడ్డిని సిఎంగాను గెలిపించుకోవాలని’ అన్నారు. ఇందులో భాగంగా బైరిపురం యూత్‌, నాయకులు పప్పల గ్రహణేశ్వ రరావు, ఉప సర్పంచ్‌ పప్పల కృష్ణమూర్తి, వైస్‌ ఎంపిపి కందుల పార్వతి, కందుల మళ్ళీ కార్జునరావు, సింగారపు రామకృష్ణ పప్పల సుధీర్‌ నాయుడు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా సందీప్‌ బైరిపురం గ్రామ దేవత కొట్టపోలమ్మ గుడిని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణరాజు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌ కుమార్‌, సరిది రమేష్‌, బాలి బంగారు నాయుడు, బాలి మహేష్‌, మండల సత్యనారాయణ పాల్గొన్నారు.వైసిపి ఇంటింటి ప్రచారండెంకాడ: మండలంలోని డి తాళ్లవలస, కొండరాజుపేట గ్రామాల్లో సోమవారం ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, ఎమ్మెల్యే తనయుడు బడ్డుకొండ మణిదీప్‌ నాయుడు సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడుని, ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, తాళ్లవలస సర్పంచ్‌ తోరువతు త్రిమూర్తులు, కొండరాజుపేట సర్పంచ్‌ సరగడ బంగారు రెడ్డి, నాయకులు డెక్క వెంకటరెడ్డి పాల్గొన్నారు.రాజకీయాలకు అతీతంగా పథకాలుబొబ్బిలి: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ఘనత వైసిపికే దక్కుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని 30వ వార్డులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రచారంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, శంబంగి శ్రీకాంత్‌, కౌన్సిలర్‌ వి.వనజకుమారి పాల్గొన్నారు.వైసిపి ఇంటింటి ప్రచారంకొత్తవలస : కొత్తవలస పంచాయతీ పరిధిలో చింతలదిమ్మలో వైసిపి నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నీలంశెట్టి గోపమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, వైసిపి మండల అద్యక్షుడు ఒబ్బిన నాయుడు, జెసిఎస్‌ మండల ఇన్‌ఛార్జి బొంతల వెంకటరావు, గొరపల్లి రవి, కొత్తవలస సర్పంచ్‌ ఎం.వై.రామస్వామి, బోడల సురేష్‌, ఆదిరెడ్డి పాల్గొన్నారు.

➡️