గోనెగండ్లలో రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ పోటీలు

Nov 23,2023 15:32 #Kurnool

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : నవంబర్ 29,30 డిసెంబర్ 1 వ తేదీలలో మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కీర్తిశేషులు శ్రీ మేకల పెద్ద రంగస్వామి స్మారక 70 వ మహిళ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీలు కుబేర నాయుడు జాకీర్ హుస్సేన్ తెలిపారు.గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీలలో 13 జిల్లాల నుండి 180 మంది క్రీడాకారులు మరియు 50 నిర్వాహకులు పాల్గొంటారన్నారు.పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించామని పోటీలు కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి,మన్సూర్,రామన్,దేవేంద్ర, ఇస్మాయిల్,కరెంటు మాబు హుస్సేన్,సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️