మైనర్లకు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : సబ్‌ కలెక్టర్‌

Jan 23,2024 16:14 #Kurnool

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్‌ స్థాయి రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. గత మాసంలో జరిగిన రోడ్‌ సేఫ్టీ సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలలో బాగంగా ఆదోని పట్టణంలో పంజరపోలు గోశాల సమీపంలో వున్న రోడ్డు మలుపు,నెట్టకల్‌ క్రాస్‌ రోడ్‌ దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు స్పీడ్‌ బ్రేకర్లు, రోడ్డుపై రంగులు సూచనలు గూర్చి అరా తీశారు. పెండిగ్లో ఉన్న వాటిని కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.రహదారి భద్రత కోసం అధికారులు కృషి చేయాలని,ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని కోరారు.వాహనదారులు భద్రత కోసం ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్‌ ధరించాలి అన్నారు.ఓవర్‌ లోడ్‌,ఓవర్‌ స్పీడ్‌ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్కూల్‌ ఆటోలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తుంటే వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే చోట ఆ యొక్క ప్రదేశాన్ని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించి అక్కడ నేమ్‌ బోర్డ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రదేశంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సమస్య లేకుండా చూడాలన్నారు.రోడ్‌ సేఫ్టీ సంబంధించిన నిబంధనలను వాహనదారులకు అవగాహన కల్పించి ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలకు తెలియజేయాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జాతీయ రహదారి మహౌత్సవాలు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి, ఏమ్మిగానూరు డిఎస్పి సీతారామయ్య, ఆర్టీవో నాగేంద్ర, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ షీశిర దీప్తి, సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, ఎంపీడీవో గీతావాణి, ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహమ్మద్‌ రఫీ, పంచాయతీ రాజ్‌, ఈ.ఈ వెంకట ప్రసాద్‌, పోలీసు, రెవెన్యూ, శాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️