జెఇఇ మెయిన్స్‌లో మెరిసిన విద్యార్థులు

Apr 25,2024 22:10

ప్రజాశక్తి-యంత్రాంగం :  జెఇఇ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. సాయి శివలోచన్‌కు 93వ ర్యాంకుసాలూరు :పట్టణానికి చెందిన మరడాన సాయి శివలోచన్‌ జెఇఇ మెయిన్స్‌లో ఆలి ండియాలో 93వ ర్యాంకు సాధించాడు. ఒబిసి కోటాలో 16వ ర్యాంకు సాధించాడు. 99.99 శాతం మార్కులు సాధించాడు. విజయ వాడ శ్రీచైతన్య కాలేజీలో చదివిన సాయి శివలోచన్‌ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు మరడాన మోహన్‌, సునీత కుమారుడు. తమ కుమారుడు జెఇఇ మెయిన్స్‌లో కనబరిచిన ప్రతిభకు మోహన్‌, సునీత, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

విజయనగరంటౌన్‌ : విజయనగరంలోని శ్రీ చైతన్య బ్రాంచ్‌ నుండి 35 మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. వారిలో 90 శాతం పైన మార్కులు సాధించిన వారిలో బల్లా సందీప్‌ శంకర్‌ 99.74 శాతం, ఎస్‌. రోషిణి 98.75 శాతం, పివిఎస్‌ఇ రాజు 98.24 శాతం, ఎన్‌.ఈశ్వర్‌ అక్షరు 96.51 శాతం, పి.వెంకట్‌ జ్ఞాన దీక్షిత 95.73శాతం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. నగరంలోని తోటపాలెంలోగల కలాం కళాశాల విద్యార్థులు జె.చైతన్య 5214, ఆర్‌.లీలాపవన్‌ 14,354వ ర్యాంకులు సాధించారు.

ఢిల్లీశ్వరరావు ప్రతిభ

బొబ్బిలి : జెఇఇ మెయిన్స్‌ పరీక్షలలో సింగిరెడ్డి ఢిల్లీశ్వరరావు ప్రతిభ కనబరిచాడు. పట్టణ ంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సింగిరెడ్డి త్రినాథ, శ్రీదేవి దంపతుల కుమారుడు ఢిల్లీశ్వర రావు 99.05 పర్సంటైల్‌ సాధించాడు. ఢిల్లీశ్వర రావు జెఇఇ మెయిన్స్‌లో ప్రతిభ కనబరచడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాణించిన యశస్వి

వీరఘట్టం: మండలం రేగులపాడుకు చెందిన మెరుగుల యశస్వి జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో 99.64శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఓపెన్‌ జనరల్‌ ర్యాంకు 5723 కాగా, ఒబిసి 1196 ర్యాంకు సాధించారు. హైస్కూల్‌ విద్య విజయవాడ శ్రీ చైతన్యలో కొనసాగించగా, ఇంటర్‌ శ్రీవిశ్వ కళాశాలలో పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.

సత్తా చాటిన సంజరు చక్రవర్తి

మండలంలోని తెట్టంగికి చెందిన అముజూరు సంజరు చక్రవర్తి గురువారం వెలువడిన జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో 99.15 శాతంతో ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాడు. చక్రవర్తి రాజాంలోనే శ్రీచైతన్యలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. ఇంటర్‌ విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తి చేశారు. చక్రవర్తి తండ్రి స్వామి నాయుడు ఇదే మండలంలోని హుస్సేన్‌ పురం గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి పద్మావతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కుల పేట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

➡️