రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ

May 26,2024 19:59

ప్రజాశక్తి – నెల్లిమర్ల : రాష్ట్ర స్థాయి ఆహ్వాన కరాటే పోటీల్లో ఆదిత్యా విద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఆదివారం విజయనగరం రాజీవ్‌ క్రీడా మైదానంలో 17వ రాష్ట్రస్థాయి ఆహ్వనపు కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన పిట్టా దేవిశ్రీ గోల్డ్‌ మెడల్‌, వసాది భూమికాశ్రద్ధ సిల్వర్‌ మెడల్‌ సాధించారు. ఈ సందర్భంగా విశ్వ కింగ్‌ కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ కోచ్‌ మధు అనిషా మాట్లాడుతూ పట్టుదలే తక్కువ సమయంలోనే మెడల్స్‌ సాధించారని తెలిపారు. రానున్న రోజుల్లో నేషనల్‌, రాష్ట్రస్థాయి విద్యార్థులు పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ వి. సూరిబాబు, అమృత సహ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

విక్టరీ విద్యార్థుల ప్రతిభ

వేపాడ: విజయనగరంలో నిర్వహించిన కరాటే పోటీల్లో విక్టరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 13 సంవత్సరాల విభాగంలో పాల్గొన్న వి.స్నేహిత సిల్వర్‌ మెడల్‌, ఎ.యామిని బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. ఈ ఇద్దరూ తమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతు న్నారని స్కూల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ శివ ప్రసాద్‌ రాఘవ్‌ తెలిపారు. కరాటే కోచ్‌ శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు రామును ఆయన అభినందించారు.

➡️