చెముడులంకలో టిడిపి జనసేన విజయోత్సవ ర్యాలీ

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట ఉమ్మడి టిడిపి శాసనసభ్యునిగా బండారు సత్యానందరావును అఖండ మెజారిటీతో గెలిపించిన మండలంలోని చెముడులంక ప్రజానీకాన్నీ అభినందిస్తూ మాజీ మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకటరత్నం, మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ మంగళవారం భారీ ఎత్తున ఉమ్మడి పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ముందుగా నాగిరెడ్డి సోదరులకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. అనంతరం బాణాసంచాతో గ్రామంలో విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ర్యాలీ ఆద్యంతం కేరింతల నడుమ నడిచింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ఈ విజయం ప్రజా విజయంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు నాగిరెడ్డి సత్యానందం, కొత్తపల్లి రాంబాబు, సిరంగుల సతీష్‌, అడబాల శ్రీను, నాగిరెడ్డి శ్రీను, తమ్మన సూర్యచంద్రం, లంకలపల్లి ఆంజనేయులు, గుండుమల్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️