పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన కలెక్టర్‌

Mar 21,2024 14:46 #collector, #Nellor

ప్రజాశక్తి -నెల్లూరు : ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను కలెక్టరు, పలువురు అధికారులు పరిశీలించారు. గురువారం సమీపిస్తున్న స్థానిక భక్తవత్సల నగర్‌ ప్రాంతంలోని కేఎన్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ బూత్‌లను, నవాబుపేట బి.వి.యస్‌. నగర పాలక బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను, స్టోన్‌ హౌస్‌ పేట ఆర్‌ఎస్‌ఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ హరినారాయణన్‌, కమిషనర్‌ వికాస్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సలహాలు సూచనలు చేశారు.

➡️