ప్రభుత్వ పాలనకు మార్గదర్శి గవర్నర్‌

Jul 2,2024 18:06
ప్రభుత్వ పాలనకు మార్గదర్శి గవర్నర్‌

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ సిఎంకె రెడ్డి
ప్రభుత్వ పాలనకు మార్గదర్శి గవర్నర్‌
ప్రజాశక్తి- తోటపల్లిగూడూరు ప్రభుత్వ పాలనకు గవర్నర్‌ టు గవ ర్నర్‌ పుస్తకం మార్గ దర్శినిగా నిలు స్తుందని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ ఎస్‌ రవి పేర్కొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ పి.ఎస్‌. రామమోహ న్‌ రావు జ్ఞాపకాల సంపుటిగా రచించిన గవర్నర్‌ పేట్‌ టు గవర్నర్‌ హౌస్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రం ఘనంగా జరిగింది. ప్రొఫెసర్‌ సిఎంకె రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నై, రాజ్‌ భవన్‌ , భారతీయార్‌ హాలు వేదికగా నిలిచింది. ఆర్‌బి ఐ మాజీ గవర్నర్‌, డాక్టర్‌ సి. రంగరాజన్‌, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌, ఎంకె నారాయణన్‌, అ ఖిల భారత తెలుగు సమాఖ్య, అధ్యక్షులు, ప్రొఫెసర్‌ సీ ఎం కే రెడ్డి సమక్షంలో ఈ పుస్తకాన్ని తమిళ నాడు గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవి లాంచనంగా ఆవిష్కరించారు. పిఎస్‌ రామమోహన్‌ రావు పుస్తక రచ నలో తన అనుభవాలను పంచుకున్నారు. 2002 నుం చి రెండేళ్ల పాటు తమిళనాడు గవర్నర్‌ గా సేవలందిం చినట్లు తెలిపారు. ఎం కె నారాయణన్‌, డాక్టర్‌ సి రంగ రాజ న్‌ పుస్తక సమీక్ష చేశారు. ముఖ్య అ తిథి ఆర్‌ ఎన్‌ రవి మాట్లాడుతూ ప్ర భుత్వ పాలన వ్యవస్థకు ఈ పుస్త కం మార్గదర్శిని వంటిదని అన్నారు. పలువురు వైస్‌ ఛాన్స్‌ లర్లు, ఉన్నతాధికారులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

➡️