మహనీయుడు శ్రీశ్రీ

Jun 16,2024 00:29 #Sri Sri vardhanthi
sri, sri vardhanthi

మహా కవి శ్రీశ్రీ 41వ వర్థంతిని పురస్కరించుకుని విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో శనివారం పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించారు. బీచ్‌ రోడ్డులో నిర్వహించిన కవితా పఠనం ఆకట్టుకుంది. సమాజాన్ని తన రచనలతో మేల్కొలిపిన గొప్ప మహనీయుడు శ్రీశ్రీ అని వక్తలు కొనియాడారు. ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : శ్రీశ్రీ వర్థంతి సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం బీచ్‌ రోడ్‌లోగల శ్రీశ్రీ విగ్రహం వద్ద సాహితీ స్రవంతి విశాఖ జిల్లా కన్వీనర్‌ పెంటకోట రామారావు ఆధ్వర్యంలో కవితా పఠన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, స్వతంత్ర కుమార్‌ శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శర్మ శ్రీశ్రీ అమూల్యమైన కవితలను చదువుతూ వాటిలోని సందేశాన్ని వివరించారు యువ కవులకు స్ఫూర్తినిచ్చే సూచనలు చేశారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు పొలమరశెట్టి ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ సాహితీ సంస్కరణను, కవితా పటిమను ప్రస్తుతిస్తూ కవితా పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కవితా పఠనంలో నగరంలోని ప్రముఖ సాహితీ సంస్థల కవులు రొంగళి రాములు, బొడ్డ కూర్మారావు, సిహెచ్‌.చిన సూర్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, పిఎల్‌వి.ప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి ఘన నివాళిప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్‌లో ఉన్న శ్రీశ్రీ విగ్రహం వద్ద అభ్యుదయ, దేశభక్తి, శ్రీశ్రీ పాటల కచేరీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం.చంటి, అధ్యక్షులు జి.రమణ, గురజాడ సాంస్కృతిక వేదిక నాయకులు దండు నాగేశ్వరరావు, సాహితీ స్రవంతి జిల్లా నాయకులు పెంటకోట రామారావు, 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు గోపాలరావు, స్టాలిన్‌, లోకేష్‌, శ్రీకాంత్‌, గణేష్‌, ఎన్‌వి.రమణ, ఎం.నాగేశ్వరరావు వై.అప్పారావు, పివి.రమణ, సుమిత్ర, మౌనిక పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజా గాయకులు ఆలపించిన పాటలు చైతన్యం నింపాయి. సీతమ్మధార : ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా పౌర గ్రంథాలయంలో శనివారం సాహిత్య సభ నిర్వహించారు. ‘ఆధునిక సాహిత్య వైతాళికుడు శ్రీశ్రీ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యుపిఎస్‌సి పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్‌.చలం అధ్యక్ష వహించిన ఈ సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య చందు సుబ్బారావు, ప్రముఖ కవి, విశ్లేషకులు గరిమెళ్ల నాగేశ్వరరావు, కథకులు మేడా మస్తాన్‌ రెడ్డి, ఉప్పల అప్పలరాజు, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.పరవాడ : మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) వర్థంతి సందర్భంగా మండల కేంద్రం పరవాడలో సిఐటియు ఆధ్వర్యాన శనివారం శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రామిక పీడిత వర్గాలకోసం శ్రీశ్రీ అనేక రచనలు చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగువీర లేవరా గేయానికి తొలిసారి జాతీయ పురస్కారం లభించిందని చెప్పారు. శ్రీశ్రీ విశాఖవాసి కావడం ఈ ప్రాంత ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పైడి లక్ష్మి, నీలిమ, అరుణ, రవణమ్మ, మధురమ, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారుఅనకాపల్లి : ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో శ్రీశ్రీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ శ్రీశ్రీ శ్రమజీవుల గొంతుక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు కండేపల్లి త్రినాధ్‌, వి.పోతురాజు, సత్యనారాయణ, రమణ, జివి.రావు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్ర కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.రాజు, మాణిక్యాలరావు, సూరిబాబు, జగదీష్‌ పాల్గొన్నారు.

➡️