అధికారులను సస్పెండ్‌ చేయాలి

Jul 1,2024 20:48
ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
అధికారులను సస్పెండ్‌ చేయాలి
ప్రజాశక్తి-కావలి : కోవూరుపల్లి చెరువును అమ్మిన అధికారులను సస్పెండ్‌ చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. సోమవారం ఆర్‌ర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో కోవూరుపల్లి చెరువును 4 ఎకరాల దాక ఆక్రమించుకొని, గోడలు నిర్మించుకొని లైటింగ్‌లు, రోడ్లు అన్ని వేశారని తెలిపారు. చెరువు సగం వరకు ఆక్రమణ ఉందన్నారు. చెరువుకు సంబంధించి 4 ఎకరాల దాకా ఆక్రమణ ఉందని, ఇరిగేషన్‌ అధికారులు తేల్చారని తెలిపారు. చెరువులు, ఇతర ప్రభుత్వభూములు ఆక్రమించుకోవడం కాకుండా కాలేజీ పక్కన ఉన్న సిజెఎఫ్‌ఎస్‌ భూములు ఆక్రమించుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెట్టి ఉన్నారని తెలిపారు. అన్ని రియల్‌ ఎస్టేట్‌ భూములపై విచారణ జరిపి ఆక్రమణదారులను తొలగించడమే కాకుండా పర్మిషన్‌ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.40లక్షలు రికవరీ చేస్తూ ప్రభుత్వానికి జమ చేయాలని బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో డి.బాబు, మోష, శ్రీనివాసులు, జరుగుమల్లి విజయరత్నం, అనేక మంది పాల్గొన్నారు.

➡️