గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది..

Apr 7,2024 00:04

సమావేశంలో ఎంపిపి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి – రెంటచింతల :
వివిధ గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మండుతున్న ఎండలకు తోడు తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చిందని పలువురు సభ్యులు వాపోయారు. మండల కేంద్రమైన రెంటచింతలలోని మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఎంపీపీ సంపూర్ణమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు గ్రామాలు చెందిన ఎంపీటీసీలు తాగునీటి సమస్య గురించి లేవనెత్తారు. పాల్వాయి గేటు గ్రామంలో ప్రభుత్వం వేసిన 20 బోర్లు ఎండిపోయాయన్నారు. గోలి గ్రామంలో 40 రోజులుగా బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. నీటి ఎద్దడికి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు తగు చర్యలు చేపట్టామని, ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్రావు, పంచాయతీరాజ్‌ డిఈ పాశం శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️