రూ.38 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యం

Apr 8,2024 21:32

ప్రజాశక్తి – రామభద్రపురం : రూ.38 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యంగా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వైకెపి ఏరియా కో ఆర్డినేటర్‌ రవికుమార్‌ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు, రామభద్రపురం, బాడంగి, మెంటాడ, బొబ్బిలి మండలాల్లో స్త్రీనిధి పథకం కింద పొదుపు సంగాల మహిళలకు రూ.38.30కోట్ల రుణాలు అందించామన్నారు. 6,465మంది మహిళలకు ఈ రుణాలు అందించి వివిధ యూనిట్లను నెలకొల్పామని తెలిపారు. స్త్రీనిధి రుణాలు కూడా శతశాతం రికవరీ అయ్యాయన్నారు. ఈ ఏడాది ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం కింద జీవనోపాదుల కోసం 98 మందికి రూ.25.53 కోట్లు విడుదల చేశామన్నారు. డ్వాక్రా మహిళలు ఈ రుణాలతో జీవనోపాదులు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బాడంగి వైకెపి ఎపిఎం భాగ్యలక్ష్మీ, బొబ్బిలి ఎపిఎం శ్రీనివాసరావు, రామభద్రపురం ఎపిఎం రత్నప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️