ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు 

May 4,2024 21:30

 ప్రజాశక్తి-బొబ్బిలి:  ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో శనివారం జరిగిన ఇవిఎంలు కమిషనింగ్‌, మాక్‌ పోలింగ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీని అడిగి తెలుసుకున్నారు.

➡️