దాహం.. దాహం తాగునీటి సమస్య

మైదుకూరు మున్సిపాల్టీలో తీవ్రతరమైంది. భూగర్బజలం పాతాళానికి పాతుకు పోతోంది. పైకసలే రానంటూ మొండికేస్తోంది. నీళ్లు లేక ప్రజల గొంతెండుతోంది. వీధి కుళాయిలో నీళ్లు రావడం లేదు. రెండు, మూడు రోజులకు వచ్చే నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ట్యాంకర్‌ నీళ్లు చాలక పోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంట పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు చూపు లేకపోవడం వల్లే తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ప్రజాశక్తి – చాపాడుమైదుకూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీటి కటకట ఏర్పడింది. మార్చి ప్రారంభం నుండే మున్సిపాలిటీలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. ఏప్రిల్‌ ప్రారంభమైనప్పటి నుండి సమస్య మరింత తీవ్రమైంది. రెండు, మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడితే వాటికోసం గంటల తరబడి వేచి ఉం డాల్సిన పరిస్థితి. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత పాలెంలో ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతు న్నారు. నెల రోజుల క్రితం మోటర్‌ చెడిపోవడంతో నీరు పూర్తిగా సరఫరా కాలేదు. దీంతో గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో మోటర్లు ఆడుతున్న సమయంలో నీటిని తెచ్చుకుంటూ ఇబ్బందులు పడేవారు. ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మున్సిపాలిటీ అధికారులు బోరును సిద్ధం చేశారు. అయితే నీటి సరఫరాలో మాత్రం ఎలాంటి మార్పు లేక.. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో తగ్గి పోయాయి. పూర్తిగా నీరు అడుగంటింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన మున్సిపాలిటీ అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధి కారులు ప్రజాప్రతినిధులు ముందుచూపు లేకపోవడం వల్ల తాగు నీటి ఎద్దడి ఏర్పడిందని ప్రజలు పేర్కొంటున్నారు. రిజర్వా యర్లలో నీటిమట్టం అందుబాటులో ఉన్న సందర్భంలో మైదు కూరు చెరువుకు నీటిని నింపి ఉంటే ప్రస్తుతం మైదుకూరు చుట్టూ పరిధిలో భూగర్భ జలాలు తగ్గేవి కావని అంటున్నారు. అలాగే పెన్నా నది నుండి మైదుకూరుకు నీటిని అందించే ముల పాకు పథకానికి ముందస్తుగా మరమ్మతులు చేపట్టి ఉంటే సమస్య ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అందు బాటులో ఉన్న బోర్లను రిపేరు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అవకాశంలేని వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.సమస్యను పరిష్కరించడంలో విఫలం తాగునీటి సమస్యను పరిష్క రించడంలో అధి కారులు పూర్తిగా విఫల మయ్యారు. వార్డులో నీటి సమస్య అది óకంగా ఉంది. పది రోజులుగా నీరు విడుదల చేయలేదు. ప్రస్తు తం వారానికి రెండు రోజులు మాత్రమే ట్యాంకర్‌ ఏర్పాటు చేసి నప్పటికీ, నీటి సరఫరా సరిగా అందడంలేదు. తాగునీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలి. – సుబ్బమ్మ, ప్రొద్దుటూరు రోడ్డు, మైదుకూరు వ్యవసాయ బోర్ల వద్దకెళుతున్నాం..ఇంటి అవసరాలకు నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. బిందెలతో ఎక్కువ దూరం నుంచి నీటిని తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంది. గత పది రోజుల నుంచి నీటి సమస్య తీవ్రమైంది. ఉదయం, సాయం త్రం వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడితే సమస్యలు ఉండవు. – నారాయణమ్మ, పాతపాలెం

➡️